సూపర్​ లుక్​ తో అల్ట్రావైలెట్‌ F77 ఈ–బైక్​ లు

By udayam on November 25th / 6:45 am IST

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ అల్ట్రావైలెట్‌ F77 పేరిట ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను లాంచ్‌ చేసింది. స్టాండర్డ్‌, రెకాన్‌ వేరియంట్లలో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. దీంతో పాటు లిమిటెడ్‌ ఎడిషన్‌ పేరిట మరో వేరియంట్‌నూ ఆవిష్కరించింది. బేస్‌ మోడల్‌ ధరను రూ.3.8 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించగా.. రెకాన్‌ వేరియంట్‌ ధరను రూ.4.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌ ధరను రూ.5.5 లక్షలుగా పేర్కొంది. రూ.10వేల టోకెన్‌ అమౌంట్‌తో అక్టోబర్‌ 23 నుంచే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది.వచ్చే ఏడాది జనవరిలో బెంగళూరులో తర్వాత దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ వంటి ఇతర నగరాల్లో ఈ బైక్‌ను డెలివరీ చేయనున్నామని కంపెనీ పేర్కొంది.

ట్యాగ్స్​