క్రికెట్​కు అపైర్​ ఆక్సెన్​ఫోర్డ్​ రిటైర్మెంట్​

By udayam on January 28th / 8:00 am IST

గత 15 ఏళ్ళుగా క్రికెట్​లోని మూడు ఫార్మాట్లకు అంపైర్​గా వ్యవహరించిన బ్రూస్​ ఆక్సెన్​ఫోర్డ్​ రిటైర్మెంట్​ ప్రకటించారు.

ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ ఒక ట్వీట్​లో వెల్లడించింది. ఇప్పటి వరకూ 62 టెస్టుల్లో అతడు అంపైర్​గా సేవలందించినట్లు పేర్కొంది. ఇటీవల ముగిసిన భారత, ఆస్ట్రేలియా జట్ల టెస్ట్​ సిరీస్​కు సిరీస్​కు అతడే అంపైర్ గా సేవలందించారు.

2006 నుంచి అతడు అంతర్జాతీయ క్రికెట్​లో అంపైర్​గా సేవలందిస్తున్నారు. మొత్తం 4 ప్రపంచ కప్​ ఫైనల్స్​లో ఆయన అంపైర్​గా నియమితులయ్యారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్​ల్యాండ్​ జట్టులో లెగ్​ స్పిన్​ బౌలర్​, లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​గానూ అంతకు ముందు అతడు క్రికెటర్​గా వ్యవహరించిన విషయం చాలా మందికి తెలియని విషయం.