లంకతో జరిగిన తొలి టీ20లో భారత నయా సంచలనం ఉమ్రాన్ మాలిక్ రికార్డ్ సృష్టించాడు. అతడు ఏకంగా 155.0 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి ఇప్పటి వరకూ భారత్ తరపున అత్యధిక స్పీడ్ వేసిన బౌలర్ గా బుమ్రా పేరిట ఉన్న రికార్డను అధిగమించాడు. బుమ్రా టాప్ స్పీడ్ గంటకు 153.36 కి.మీ.ల వేగంతో బంతిని వేస్తే.. షమీ 153.3 కి.మీ.ల వేగంతో 3వ స్థానంలోనూ, నవదీప్ సైనీ గంటకు 152.85 కి.మీ.ల వేగంతో 4వ స్థానానికి పడిపోయారు.ఈ మ్యాచ్లో ఉమ్రాన్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 27 పరుగులు ఇచ్చాడు.