హైదరాబాద్ నయా స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది ఐపిఎల్‌లో అత్యధిక వేగవంతమైన బాల్‌ను విసిరాడు. నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ ధోనీ స్ట్రైకింగ్లోకి రాగానే ఉమ్రాన్ తన వేగాన్ని అతడికి రుచి చూపించాడు. ఏకంగా గంటకు 154 కి.మీ.ల వేగంతో అతడు విసిరిన బంతికి ధోనీ వద్ద సమాధానమే లేదు. ఈ ఏడాది ఐపిఎల్‌లో వరుసగా 154.0, 153.3, 153.1, 152.9 వేగంతో టాప్ 5 స్పీడ్ బాల్స్‌లో 4 ఉమ్రాన్‌వే ఉన్నాయి.