భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ లంకతో జరిగిన తొలి వన్డేలో చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్ గా నిలిచాడు. రెండో ఓవర్ లో ఏకంగా 156 కి.మీ వేగంతో బాల్ వేశాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇటీవల శ్రీలంకతో టీ20లోనూ ఉమ్రాన్ 155 కి.మీ స్పీడ్ తో బాల్ వేసి ఆ ఘనత సాధించిన ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.