ఆఫ్ఘన్ల కోసం ముందుకొచ్చిన ఐరాస

By udayam on September 14th / 7:47 am IST

దారుణ కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్న ఆఫ్ఘనీయులను ఆదుకోవడానికి ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితికి మనసొచ్చింది. అక్కడి ప్రజల కష్టాలను తీర్చడానికి 20 మిలియన్ల డాలర్లను ఆర్ధిక సాయంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెర్రిస్​ ప్రకటించారు. దాంతో పాటు దాతలు మరో 1.2 బిలియన్​ డాలర్లు ఆర్ధిక సాయం ప్రకటించారని దానిని కూడా ఆఫ్ఘనీయుల అభివృద్ధి కోసం వెచ్చిస్తామని తెలిపారు. వీటి సాయంతో వారికి ఆహారం, మందులు, ఆరోగ్య సదుపాయాలు, సురక్షిత మంచినీరు, శానిటైజేషన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్​