సిరియా 3.5 లక్షల మంది మృతి

By udayam on September 25th / 5:59 am IST

సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 3.5 లక్షల మంది మరణించారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అయితే కొన్ని నెలల ముందు సిరియా మానవ హక్కుల కమిటీ ఈ అంతర్యుద్ధంలో 6.6 లక్షల మంది మరణించారని చెప్పగా తాజాగా సమితి మాత్రం అందులో సగమే మరణాలు సంభవించాయని పేర్కొనడం గమనార్హం. 2011 మార్చి నుంచి 2021 మార్చి వరకూ ఈ మరణాలను లెక్కించినట్లు సమితి పేర్కొంది.