బేషరమ్​ పాట రగడ: మధ్యప్రదేశ్​ లో పఠాన్​ పై బ్యాన్​!

By udayam on December 15th / 7:35 am IST

నాలుగేళ్ళ విరామం తర్వాత వెండితెరకు వస్తున్న బాలీవుడ్​ బాద్షా షారూక్​ ఖాన్​ మూవీ ‘పఠాన్​’ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘బేషరమ్​’ సాంగ్​ లో దీపికా పదుకొణే బికినీలో అందాల ఆరబోత పై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు మధ్యప్రదేశ్​ బిజెపి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో దీపికా కాషాయం కలర్​ బికినీలో కనిపించడంతో పాటు వల్గర్​ గా ఉన్న డ్యాన్స్​ మూవ్స్​ చేసిందంటూ మధ్యప్రదేశ్​ హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీన్లను కట్​ చేస్తేనే తమ రాష్ట్రంలో ఈ మూవీ ప్రదర్శనకు అనుమతిస్తామంటూ తేల్చిచెప్పారు.

ట్యాగ్స్​