యునిసెఫ్​: తెలంగాణ సర్కార్​ పనితీరు భేష్​

By udayam on December 30th / 10:37 am IST

తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు సంరక్షణ ఎంతో బాగుందని యునిసెఫ్ కితాబిచ్చింది. మాతా,శిశు మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిడ్ వైఫరీ వ్యవస్థ అద్భుతమని కొనియాడింది. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ ఈ విధానం ఆదర్శమని ప్రశంసలు కురిపించింది. ఈమేరకు యునిసెఫ్ ఇండియా శుక్రవారం ఓ ట్వీట్ చేసింది. ‘ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎ హెల్దీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైద‌రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న శిశువు ఫోటోను అందులో షేర్ చేసింది.

ట్యాగ్స్​