తిరుపతి వెంకన్న సన్నిధిలో ఓ 5 ఏళ్ళ చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఈ ఘటనలో తప్పిపోయిన బాలుడిని గోవర్ధన్ రాయల్‌గా గుర్తించారు. దర్శనం ముగించుకుని ఆలయ గోపురం ఎదురుగా కూర్చున్న సమయంలో ఆ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సిసిటివి ఫుటేజ్‌ను గమనిస్తున్నారు. ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.