ఆంధ్రాతో సరిహద్దు సమస్యల్ని పరిష్కరించండి

ఒడిశా ముఖ్యమంత్రికి సూచించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర పదాన్​

By udayam on November 20th / 6:45 am IST

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ఆ రాష్ట్ర సరిహద్దు విషయంలో తలెత్తిన సమస్యల్ని ఆంధ్రాతో కలిసి చర్చించి పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ సూచించారు. ఈ మేరకు అన్ని పార్టీలతో కలిసి కార్యాచరణను రూపొందించాలని, అవసరమైతే తాము సైతం మధ్యవర్తిత్వం వహిస్తామని ఆయన తెలిపారు.

అసలు ఈ వివాదం ఎలా మొదలైంది?

ఆంధ్రా సరిహద్దుల్లోని పల్లెటూర్లలో ఒడిశా రాష్ట్రానికి చెందిన అధికారులు పెట్టిన సైన్​బోర్డ్​లను ఆంధ్రా, విశాఖపట్నం రెవెన్యూ అధికారులు తొలగించడంతో వివాదం మొదలైంది. అలా తొలగించిన బోర్డులను 500 మీటర్ల అవతల ఒడిశా సరిహద్దుల వద్ద వాటిని మన రాష్ట్ర అధికారులు తిరిగి పెట్టారు. అయితే కోరాపుట్​ సబ్​ కలెక్టర్​, స్థానిక ఎమ్మెల్మే, సునబేడ డిఎస్పీలు తిరిగి వాటిని ఆంధ్ర అధికారులు తొలగించిన ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు.

ఒడిశా ఏమంటోంది?

అయితే ఒడిశా అధికారులు మాత్రం తాము సైన్​ బోర్డులు పెట్టిన సునబేడా గ్రామం కోరాపుట్​ జిల్లాలోని పొట్టాంగి ప్రాంతానికి చెందినదని అని అక్కడ సైన్​ బోర్డులు ఏర్పాటు చేశామని అంటున్నారు.

దీనిపై కోరాపుట్​ అసిస్టెంట్​ కలెక్టర్​ అర్చన దాస్​ మాట్లాడుతూ ఒడిశాలోని 30 జిల్లాలకు గానూ 14 జిల్లాలు ఆంధ్ర, ఛత్తీస్​ఘడ్​, పశ్చిమ బెంగాల్​ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయని తెలిపారు. అయితే గొడవ జరిగిన ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగానే ఉందని తాము అక్కడ పర్యటించినట్లు వివరించారు.

కేంద్రం ఏమంటోంది?

పేపర్లలో ఉన్న ఖచ్చితంగా ఉన్న బోర్డర్లనే అన్ని రాష్ట్రాలు పాటించాలని, ఒడిశా తనతో సరిహద్దులు పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్​, ఛత్తీస్​ఘడ్​, పశ్చిమ బెంగాల్​లతో ఉన్న సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా చర్చలు ప్రారంభించాలని కేంద్రం కోరింది.