కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ మేనల్లుడు నంద్ కిషోర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. యూపీ రాజధాని లక్నోలోని దుబగ్గలోని బిగారియా ప్రాంతంలో తన నివాసంలో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కౌశల్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.కౌశల్ కిషోర్ పార్లమెంటులో మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.