ఐరాస: అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గ్లోబల్ టెర్రరిస్టే

By udayam on January 18th / 6:13 am IST

భారత గత ఏడాది కాలంగా గగ్గోలు పెడుతున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఎట్టకేలకు ఒప్పుకుంది. పాకిస్థాన్​ తీవ్రవాది అబ్దుల్​ రెహ్మాన్​ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. యూఎన్ఎస్‌సీ ఐఎస్ఐఎల్ (దాఎష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబా తీవ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన తీసుకువచ్చింది. కానీ, చైనా దానిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. 2011 నవంబర్ 26న భారతదేశంలో జరిగిన తీవ్రవాద దాడుల సూత్రధారిగా భావించే జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ బంధువు.

ట్యాగ్స్​