ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా రాంపూర్ లోని ప్రత్యేక కోర్ట్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు షాక్ ఇచ్చింది. విచారణకు రమ్మని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని కారణంగా ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్ట్ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.వచ్చే మంగళవారం విచారణకు జయప్రదను కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది.