ఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి ఆవరణలో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. పేలుడు శబ్దలా ధాటికి ఆసుపత్రి అద్దాలు ముక్కలయ్యాయి. ఆసుపత్రికి దగ్గర్లో ఉన్న ఇళ్ళల్లోనూ ఈ పేలుడు ప్రభావం కనిపించింది. ప్రమాద సమయంలో ఆసుపత్రికి సమీపంలో ఉన్న రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు దుర్మరణం చెందినట్లు సిసిటివి లో రికార్డ్ అయింది. ఘటన జరిగిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్లతో ఓ ట్రక్కు రోడ్డుపై ఆపి ఉంచారని స్థానికులు చెబుతున్నారు.