ఒబామాపై ఉత్తర ప్రదేశ్​ లాయర్​ కేసు

భారత నాయకుల్ని ‘ప్రామిస్డ్​ ల్యాండ్​’ అవమానించిందంటూ పోలీసులకు కంప్లైంట్​

By udayam on November 20th / 11:25 am IST

అమెరికా తొలి ఆఫ్రికా అమెరికాన్​ అధ్యక్షుడు బరాక్​ ఒబామా సరికొత్త పుస్తకం ‘ఎ ప్రామిస్డ్​ ల్యాండ్​’పై ఉత్తర ప్రదేశ్​కు చెందిన ఓ లాయర్​ పోలీసులకు కంప్లైంట్​ చేశాడు.

ఆల్​ ఇండియా రూరల్​ బార్​ అసోసియేషన్​ జాతీయ అధ్యక్షుడైన జ్ఞాన్​ ప్రకాష్​ ఒబామా పుస్తకంలో భారతదేశ జాతీయ స్థాయి నాయకుల్ని అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ వంటి వారిని దేశంలో కోట్లాది మంది ప్రజలు అనుసరిస్తారని, అలాంటి వారిపై పుస్తకంలో తప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల దేశంలో అశాంతికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకాష్​ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్​లో వివరించారు.

తన కంప్లైంట్​ను రిజిస్టర్​ చేయకపోతే అమెరికా రాయబార కార్యాలయం ముందు ఉపవాస దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.