మంత్రిని కొరికిన ఎలుకలు

By udayam on May 2nd / 1:23 pm IST

ఉత్తరప్రదేశ్​కు చెందిన మంత్రి గిరీష్​ చంద్ర యాదవ్​ను ఎలుకలు కరవడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆ రాష్ట్ర యూత్​ వెల్ఫేర్​, స్పోర్ట్స్​ మంత్రిగా ఉన్న ఆయనను సోమవారం తెల్లవారుఝామున ఎలుకలు కరిచాయి. ఆ సమయంలో ఆయన బండా జిల్లాలో పర్యటనలో ఉన్న ఆయన సర్క్యూట్​ హౌస్​లో బస చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన కుడి చేతిని ఎలుకలు కొరికాయని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ ఎస్​.ఎన్​.మిశ్రా తెలిపారు.

ట్యాగ్స్​