క్రిస్మస్​ వీకెండ్​ : ధియేటర్లలో గట్టి పోటీనే

By udayam on December 19th / 11:17 am IST

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా థియేటర్‌లో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం థియేటర్‌తోపాటు, ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలివే.. విశాల్​ నటిస్తున్న లాఠీ ఈనెల 22న ధియేటర్లలోకి రానుంది. నయనతార హర్రర్​ మూవీ కనెక్ట్​ కూడా ఈ గురువారమే (22న) ధియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. రవితేజ, శ్రీలీల యాక్షన్​ ఎంటర్​ టైనర్​ ‘ధమాకా’ 23న వస్తుంటే.. నిఖిల్​, అనుపమ పరమేశ్వరన్​ ల లవ్​ స్టోరీ 18 పేజెస్​ కూడా అదే రోజు విడుదలవుతోంది. మసూద 21న ఆహాలో స్ట్రీమింగ్​ కానుంది.

ట్యాగ్స్​