దేశంలో యూపీఐ లావాదేవీలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. గడిచిన ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో రూ.10 ట్రిలియన్లను వినియోగదారులు యుపిఐల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారు. మొత్తం 5.58 బిలియన్ల ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.9.83 ట్రిలియన్లను తరలించారు. అంతకు ముందు నెలలో 5.4 బిలియన్ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.9.6 ట్రిలియన్లు లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ శాతం 111 శాతం ఎక్కువగా ఉంది.