ఏకీకృత చెల్లింపుల విధానం -యూపీఐ ద్వారా గత డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల లావాదేవీల ద్వారా ఏకంగా 12.82 లక్షల కోట్ల రూపాయల పేమెంట్స్ నమోదయ్యాయి. 2016లో ప్రారంభమైన యూపీఐ ప్లాట్‌ఫామ్ దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక సేవల విభాగం సోమవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.