అమెరికాలో విమానయాన సర్వీసులన్నీ హఠాత్తుగా స్తంభించిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అమెరికా అంతటా సేవలు నిలిచిపోయాయి. బుధవారం రోజంతా విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేందుకు ఎఫ్‌ఏఏ.. ఎయిర్‌లైన్లకు ఇచ్చే నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎఫ్‌ఏఏ ట్విట్టర్‌లో వెల్లడించింది.