కొరియా ద్వీపంలో అమెరికా బాంబర్లు

By udayam on December 21st / 9:41 am IST

కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉత్తరకొరియా లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా యుద్ధ విమానాలు విన్యాసాలు చేపట్టాయి. అణు బాంబులను ప్రయోగించే అమెరికా యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. వీటితోపాటు స్టెల్త్ ఫైటర్ జెట్లు కొరియా ద్వీపకల్పం గగనతలంపై చక్కర్లు కొట్టాయి. మరోవైపు తాము తయారీ చేస్తున్న నిఘా ఉపగ్రహం సామర్థ్యంపై.. శత్రుదేశాలు అనుమానాలు వ్యక్తం చేయడంపై ఉత్తరకొరియా అధినేత కిమ్ సోదరి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

ట్యాగ్స్​