అమెజాన్​ను మోసం చేసిన కేసులో 20 ఏళ్ళ జైలు

By udayam on October 9th / 7:51 pm IST

అమెజాన్​ నుంచి వస్తువుల్ని కొని వాటి స్థానంలో పాత వాటిని రిటర్న్​ చేసిన కేసులో ఓ వ్యక్తికి 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది. అమెరికాకు చెందిన 31 ఏళ్ళ హడ్సన్​ హామ్రిక్​ అనే వ్యక్తి గత ఐదేళ్ళుగా ఖరీదైన ఎలక్ట్రానిక్స్​, గిటార్స్​, టూల్స్​, కంప్యూటర్లను అమెజాన్​ నుంచి కొని వాటి స్థానంలో సెకండ్​ హ్యాండ్​ వస్తువుల్ని రిటర్న్​ పెట్టేవాడు. ఇలా ఆ వ్యక్తి 2.25 కోట్ల రూపాయలు అమెజాన్​కు కన్నం వేశాడు. దీంతో అతడి కొనుగోలు ప్రవర్తనపై అమెజాన్​ కోర్టుకెళ్ళగా అతడికి 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 2 కోట్ల రూపాయల జరిమానా పడింది.

ట్యాగ్స్​