క్వాడ్​ సమావేశానికి ప్రధాని మోదీ

By udayam on September 14th / 7:33 am IST

క్వాడ్​ దేశాల సమావేశం ఈనెల 24న అమెరికా రాజధాని వాషింగ్టన్​లో ప్రెసిడెంట్​ జో బిడెన్​ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు జపాన్​ ప్రధాని ప్రధాని యోషిహిడె సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​లు సైతం హాజరుకానున్నారు. కొవిడ్ పరిస్థితి, వాతావరణ మార్పులు, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్​ వాణిజ్యం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా చర్చకు రానున్నాయి.

ట్యాగ్స్​