4 ఏళ్ళ తర్వాత క్యూబన్లకు యుఎస్​ వీసాలు

By udayam on May 4th / 9:20 am IST

నాలుగేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్యూబాలోని అమెరికన్​ ఎంబసీ.. అక్కడి పౌరులకు యుఎస్​ వీసాల జారీని మొదలుపెట్టింది. క్యూబా రాజధానిలో 2017లో అమెరికా అధికారులే లక్ష్యంగా సోనిక్​ దాడి జరిగిన అనంతరం అమెరికా అక్కడి పౌరులకు వీసా జారీ ప్రక్రియను నిలిపేసింది. హవానా సిండ్రోమ్​గా పేరుగాంచిన ఈ ఘటన అనంతరం క్యూబా, అమెరికా దేశాల మధ్య దౌత్య సంబంధాలు సైతం దారుణంగా దెబ్బతిన్నాయి.

ట్యాగ్స్​