క్షిపణులతో సమాధానం ఇచ్చిన దక్షిణ కొరియా, అమెరికా

By udayam on October 5th / 9:42 am IST

జపాన్ మీదుగా ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణికి స్పందనగా దక్షిణ కొరియా, అమెరికా సైన్యం పలు క్షిపణులను పేల్చాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. జపాన్, కొరియా ద్వీపకల్పానికి మధ్య ఉన్న, జపాన్ సముద్రంగా పేరొందిన తూర్పు సముద్రంలోకి ఈ క్షిపణులను ప్రయోగించారు. 2017 తర్వాత తొలిసారి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పేల్చింది. మంగళవారం ఈ క్షిపణి జపాన్ మీదుగా దూసుకెళ్లింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. తమ శక్తిని తెలియజెప్పడమే ఈ విన్యాసాల ఉద్దేశం.

ట్యాగ్స్​