డెమొక్రటిక్​ పార్టీ స్పీకర్​ పదవికి నాన్సీ పెలోసీ రాజీనామా

By udayam on November 18th / 9:37 am IST

దాదాపు రెండు దశాబ్దాలుగా స్పీకర్​ స్థానంలో ఉన్న నాన్సీ పెలోసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ పదవిలో తాను కొనసాగలేనని రాజీనామా చేశారు. ఛాంబర్​ కు నాయకత్వం వహించి తొలి మహిళగా నాన్సీ రికార్డులకెక్కారు. డెమొక్రాట్లకు కొత్త తరం నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్టు చెప్పిన ఈ 82 ఏళ్ళ స్పీకర్.. కాంగ్రెస్​ దిగువ సభలో కాలిఫోర్నియా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల తర్వాత హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ లభించింది. దీంతో స్పీకర్ పదవిని కూడా త్వరలో మరొకరు చేపట్టనున్నారు.

ట్యాగ్స్​