మూగబోయిన ‘టాక్​ షో’

టాక్ షో దిగ్గజం లారీ కింగ్​ ఇకలేరు

By udayam on January 24th / 6:28 am IST

లాస్ఏంజెలెస్: దాదాపు అర్ధ శతాబ్దంపాటు తన ఇంటర్వ్యూలతో అమెరికాను ఒక ఊపు ఊపేసిన టాక్  షో దిగ్గజం ‘లారీ కింగ్’ కన్నుమూశారు.

ఆయన వయసు 87 సంవత్సరాలు. లాస్ఏంజెలెస్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు  ఓరా మీడియా తెలిపింది.

ప్రపంచ నేతల నుంచి సినీ దిగ్గజాల వరకు ఎంతోమంది ఇంటర్వ్యూ లు చేసిన ఆయనకు వరల్డ్ వైడ్  ఫాన్స్  ఉన్నారు. దాదాపు 50 వేల ఇంటర్వ్యూలు చేశారు.

దలైలామా నుంచి ఎలిజబెత్ టేలర్ వరకు, మిఖాయిల్ గోర్బచేవ్ నుంచి బరాక్ ఒబామా వరకు, బిల్ గేట్స్ నుంచి లేడీ గాగా వరకు ఎందరినో ఆయన ఇంటర్వ్యూ చేశారు.

పీఎల్ఓ చైర్మన్ యాసర్ అరాఫత్, జోర్డాన్ రాజు కింగ్ హుస్సేన్, ఇజ్రాయెల్ ప్రధాని యిట్జాక్ రాబిన్‌లతో కలిసి మధ్య ప్రాచ్య శాంతి శిఖరాగ్ర సమావేశానికి  1995లో కింగ్ అధ్యక్షత వహించారు.

టెలివిజన్ ప్రొడక్షన్ స్టూడియో  ‘ఓరా మీడియా’కు లారీ కింగ్ సహ వ్యవస్థాపకుడు.  ఆయన మరణించినట్టు పేర్కొన్నప్పటికీ కారణాన్ని మాత్రం ‘ఓరా మీడియా’ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే, కరోనా వల్లే ఆయన మరణించినట్టు టాక్. అయితే  లారీ కింగ్ కరోనా బారినపడి వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఈ నెల 2న సీఎన్ఎన్ ప్రకటించింది. జాతీయ రేడియోలో దీర్ఘకాలంపాటు పనిచేసిన లారీ కింగ్.. 1985 నుంచి 2010 వరకు సీఎన్ఎన్‌కు సేవలు అందించారు.

ట్యాగ్స్​