రష్యా నుంచి భారత్ తన ఆయుధ కొనుగోళ్ళను తగ్గించుకునేలా చేసేందుకు అమెరికా భారీ ఆఫర్ను ప్రకటించింది. ఏకంగా రూ.3750 కోట్ల విలువైన మిలటరీ సామాగ్రిని అందించడానికి ముందుకొచ్చింది. ఈ మిలటరీ ప్యాకెజ్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య మరింత బలమైన రక్షణ సహకారం నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఇంత భారీ మొత్తంలో రక్షణ ఉత్పత్తులను అమెరికా మరో దేశానికి ఇవ్వడం ఇజ్రాయెల్, ఈజిప్ట్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఈ ప్యాకేజీలో ఎలాంటి ఆయుధాలను అమెరికా అందిస్తుందన్నది ఇంకా తేలలేదు.