చైనా, తైవాన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా తాజాగా మరోసారి అందుకు తెగబడింది. తైవాన్ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక గురువారం ప్రయాణించింది. ఇది రొటీన్ కార్యక్రమంగా అమెరికా మిలటరీ పేర్కొనగా, చైనా ఈ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా యుద్ధ నౌకలే కాదు, మిత్ర దేశాలైన బ్రిటన్, కెనడా వంటి దేశాల యుద్ధ నౌకలు కూడా తైవాన్ జలసంధి మీదుగా ప్రయాణిస్తూ, చైనాను రెచ్చగొడుతున్నాయి. అర్లేగ్ బుర్కె తరగతికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ చుంగ్‌ాహూన్ తైవాన్ జలసంధిలో ప్రయాణించిందని అమెరికా మిలటరీ ఒక ప్రకటనలో తెలియజేసింది.