అమెరికా అండర్​–19 జట్టులో నలుగురు మనవాళ్ళే

By udayam on December 15th / 9:36 am IST

ఒక క్రికెట్​ జట్టులో వరుసగా గీతికా కొడాలి, అనికా కలన్​, అదితి చౌదాసమ, భూమికా భద్రిరాజు.. ఇలా వరుసగా భారతీయుల పేర్లుంటే మీరేమనుకుంటారు.. ఇదేదే భారత క్రికెట్​ మహిళల జట్టు అనుకుంటారు కదా! కానీ అక్కడే పప్పులో కాలేశారు.. ఇది మన జట్టు కాదండోయ్.. వచ్చే నెలలో సౌతాఫ్రికాలో జరిగే అండర్​–19 వరల్డ్​ కప్​ కోసం అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన జట్టు. మొత్తం 15 మంది అమెరికా ప్లేయర్లలో నలుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. ఈ జట్టుకు కోచ్​ గా వెస్టిండీస్​ లెజెండరీ బ్యాటర్​ శివనారాయణ చంద్రపాల్​ కోచ్​ గా ఉండనున్నాడు.

ట్యాగ్స్​