యుఎస్​ బాక్సాఫీస్​ వద్ద వాల్తేరు వీరయ్య సునామీ

By udayam on January 10th / 11:04 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “వాల్తేరు వీరయ్య” మరో మూడ్రోజుల్లో ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ మరింత జోరందుకున్నాయి. అమెరికా బాక్సాఫీస్​ వద్ద ఈ మూవీకి అప్పుడే 3.5 లక్షల డాలర్ల టికెట్లు సేల్స్​ జరిగినట్లు మేకర్స్​ స్పెషల్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. విడుదలకు మరో 3 రోజులు ఉండడంతో ఈ నెంబర్​ రూ.6 లక్షల డాలర్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బాబీ డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు.

ట్యాగ్స్​