600 అడుగుల భారీ ప్రాజెక్ట్ను ఎలాంటి పనివాళ్ళు లేకుండా నిర్మించడానికి చైనా సిద్ధమవుతోంది. టిబెట్ వద్ద నిర్మించనున్న ఈ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా ఎఐ, కన్స్ట్రక్షన్ రోబోట్లతో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. దాదాపు 2 ఏళ్ళలో ఈ 590 అడుగుల యాంగ్జు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. 3డి ప్రింటింగ్, మానవ రహిత ఎక్స్కవేటర్లు, ట్రక్కులు, బుల్డోజర్లు, పేవర్స్, రోలర్స్ను వాడనుంది.