తన పెళ్ళి కోసం కాబోయే అత్తింటి వారు కొనిచ్చిన లెహెంగా నాసిరకంగా ఉందని ఓ పెళ్ళి కూతురు ఏకంగా పెళ్ళినే రద్దు చేసింది. ఉత్తరాఖండ్ లోని హల్ద్వాని లో జరిగిన ఈ ఘటనలో రూ.10 వేల ఖరీదైన లెహెంగా ఆమెకు చీపై పోయింది. జూన్ లో నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట.. లక్నోలో లెహెంగా కొనాలని పెళ్ళికొడుకును ముందు నుంచే డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 5న జరగాల్సిన తన పెళ్ళికి కేవలం రూ.10 వేలు పెట్టి లెహంగా కొన్నారంటూ ఆమె పెళ్ళిని రద్దు చేసింది. ఆపై పెళ్లికొడుకు తండ్రి తన ఎటిఎం కార్డును ఇచ్చి నీకు కావాల్సిన షాపింగ్ చేసుకోమని చెప్పినా ఆమె శాంతించలేదు.. సరికదా మా గుమ్మం మరోసారి తొక్కొద్దంటూ తేల్చి చెప్పేసింది.