టాలీవుడ్ అగ్ర నటి కీర్తి సురేష్ తాజా చిత్రం వాషి టీజర్ వచ్చేసింది. మళయాళంలో అగ్ర నటుడు టోవినో థామస్తో కలిసి మహానటి నటించిన ఈ మూవీకి మలయాళం ఆడియన్స్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. లాయర్లుగా వీరిద్దరి నటన హైలైట్గా ఉండనుందని టీజర్ చూస్తూనే అర్ధమవుతోంది. ప్రేమించుకున్న వీరిద్దరే ఓ కేసు విషయమై ప్రత్యర్ధులుగా మారి వాదనలు వినిపించడం టీజర్లో హైలైట్. వచ్చే నెల 17న విడుదల కానున్న ఈ మూవీలో కొట్టాయం రమేష్, విశ్వనాథ్, మీనన్ బైజు లు కూడా నటిస్తున్నారు.