దేశంలో 6,189 జడ్జిల పోస్టులు ఖాళీ

By udayam on December 24th / 7:07 am IST

దేశంలో సుప్రీంకోర్టు నుంచి కింద కోర్టు వరకు 6,189 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. 022 జనవరి 19 నాటికి దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 5,850 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్​ లో 73, తెలంగాణలో 150 పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. దేశంలో 2022 డిసెంబర్‌ 15 నాటికి కిందస్థాయి కోర్టుల్లో 4,29,40,290 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 8,16,562 కేసులు, తెలంగాణలో 10,52,051 కేసులు పెండింగ్​ లో ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​