అమెరికా: కొవిడ్​ మృతుల్లో వ్యాక్సిన్​ తీసుకున్న వారే ఎక్కువట

By udayam on November 25th / 10:54 am IST

అమెరికాలోని కొవిడ్ మృతుల్లో ఎక్కువ మంది కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్న వారే ఉంటున్నారని వాషింగ్టన్​ పోస్ట్​ సంచలన నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్​ లో కొవిడ్​ తో మరణించిన వారిలో 58 శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్​ ను తీసుకున్న వారే ఉన్నట్లు బయటపెట్టింది. వీరిలో సగానికి పైగా బూస్టర్​ డోస్​ కూడా తీసుకున్నట్లు తెలిపింది. కొవిడ్​ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి.. కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోని వారి మరణాలు భారీగా తగ్గాయని తెలిపింది. ఆగస్ట్​ నెలలో మొత్తం కొవిడ్ మృతుల్లో వీళ్ళు 23 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​