ప్రపంచ రికార్డ్​ వ్యోమగామి పోల్యాకోవ్​ కన్నుమూత

By udayam on September 20th / 12:31 pm IST

అంతరిక్షంలో ఏకధాటిగా 437 రోజులు గడిపిన రష్యన్ వ్యోమగామి వలేరీ పోల్యాకోవ్ (80) మరణించినట్లు రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఇప్పటికీ ఈ రికార్డు ఆయన పేరిటే ఉంది. ఆయన 1994-1995 మధ్యలో మీర్ స్పేస్ స్టేషన్ లోభూమి చుట్టూ 7000 సార్లు పరిభ్రమణం చేస్తూ 437 రోజులు గడిపారు. ఆయన1988 ఆగస్టులో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేపట్టి 8నెలలు కక్ష్యలో ఉన్నారు. అనంతరం మరోసారి అంతరిక్షయానానికి వెళ్ళి ఏకంగా 437 రోజులు గడిపారు.

ట్యాగ్స్​