వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం

By udayam on December 2nd / 11:17 am IST

ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్ ప్రెస్ గుజరాత్ లోని ఉద్వాడ, వాపి స్టేషన్ల మధ్య గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం కాస్త దెబ్బతింది. అయితే మరమ్మతుల అనంతరం కొంత సేపటి తర్వాత రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వందే భారత్ కు ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి.

ట్యాగ్స్​