ఈనెల 19న సికింద్రాబాద్–వైజాగ్ నగరాల మధ్య ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో ప్రయాణ సమయం దాదాపు 43 శాతం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య తిరిగి గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ సమయం 14 గంటలు కాగా.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రాకతో ఈ సమయం కేవలం 8 గంటలు మాత్రమే కానుంది. ఈ ట్రైన్ లో 16 కోచ్ లు ఉండగా.. అందులో 1128 సీటింగ్ సామర్థ్యం ఉండనుంది. 180 కి.మీ.ల వేగంతో పట్టాలపై పరుగులు పెట్టనున్న ఈ ట్రైన్.. 0–100 కి.మీ. వేగాన్ని కేవలం 52 సెకండ్లలో అందుకోనుంది.