కేంద్రం స్లీపర్ ఫీచర్​​ వచ్చాకే విశాఖ–తిరుపతి మధ్య వందేభారత్​ రైళ్ళు

By udayam on December 14th / 12:34 pm IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నగరాలైన విశాఖపట్నం – తిరుపతిల మధ్య వందేభారత్ రైలును ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, గురుమూర్తిలు కోరారు. వందేభారత్ రైలును విశాఖ, తిరుపతి నగరాల మధ్య కేటాయిస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానమిస్తూ… వందేభారత్ రైలులో కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణించేందుకు వీలుందన్నారు. శాస్త్రీయంగా ఈ రైళ్ళను 550 కిలో మీటర్ల దూరంలోని లక్షిత ప్రాంతాలకే కేటాయించాల్సి ఉందన్నారు.స్లీపర్ కోచ్ లను ఏర్పాటు చేస్తే…. తప్పనిసరిగా ఈ రెండు నగరాల మధ్య రైళ్ళను కేటాయించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి వివరించారు.

ట్యాగ్స్​