జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను లీక్ చేసినందుకు ఈ సర్వేకు నేతృత్వం వహించిన అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను వారణాసి కోర్ట్ తొలగించింది. అజయ్ మిశ్రా సన్నిహితుడు మీడియాకు ఈ రిపోర్ట్ లీక్ చేసినట్లు గుర్తించిన కోర్ట్.. తన తుది నివేదికను ఇవ్వడానికి ప్యానెల్‌కు మరో 2 రోజుల గడువు ఇచ్చింది. 3 రోజుల పాటు ఈ మసీదులో వీడియో గ్రఫీ సర్వే చేసిన ఈ కమిటీ అక్కడి నీటి కొలనులో 12 అడుగుల శివ లింగాన్ని గుర్తించిన వార్తలు మీడియాలో లీక్ అయ్యాయి.