వారసుడు ట్రైలర్​ ఈ సాయంత్రమే

By udayam on January 4th / 5:45 am IST

విజయ్​, రష్మిక మందాన, వంశీ పైడిపల్లి కాంబోలో సిద్ధమైన తమిళ మూవీ ‘వారిసు’ రిలీజ్​ ట్రైలర్​ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు లాంచ్​ చేయనున్నారు. తెలుగులో వారసుడు పేరుతో వస్తున్న ఈ మూవీకి దిల్​ రాజు నిర్మాత కాగా.. తమన్​ సంగీత దర్శకుడుగానూ పనిచేశారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి ట్రైలర్​ ను సిద్ధం చేస్తున్నారు.ఈ మూవీలో విజయ్​ కు అన్నయ్యగా టాలీవుడ్​ హీరో శ్రీకాంత్​ నటిస్తున్నాడు. ప్రకాష్​ రాజ్​, ప్రభు, శరత్​ కుమార్​, జయసుధ, ఖుష్బూలూ నటిస్తున్నారు.

ట్యాగ్స్​