వారిసు రివ్యూ: టివి సీరియల్ సీన్స్​, కామెడీ, ఎమోషన్స్​

By udayam on January 11th / 11:26 am IST

విజయ్​ ఫ్యాన్స్​ భారీ అంచనాలు పెట్టుకున్న వారిసు మూవీ ఈరోజు రిలీజైంది. టివి సీరియల్​ వంటి ఫ్యామిలీ డ్రామా, తల్లి – కొడుకుల మధ్య అంతగా అతకని బంధం ఈ మూవీ తొలి అర్ధ భాగాన్ని బాగా చప్పగా సాగేలా చేస్తుంది. తండ్రి (శరత్​ కుమార్​) నడుపుతున్న మైనింగ్​ ఇండస్ట్రీపై కన్నేసి.. అతడి కుటుంబం మొత్తాన్ని విడదీసిన వీలన్​ (ప్రకాష్​ రాజ్​) పై హీరో విజయ్​ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఈ మూవీలో చూపించారు. ఈ మూవీలో యాక్షన్​, రొమాన్స్​, కామెడీ అంతా ఇరికించినట్లే కనిపిస్తుంది తప్ప ఎక్కడా సహజంగా అనిపించదు. తనకు అలవాటైన పాత్రలో విజయ్​ ఒక్కడే ఈ మూవీని ఒంటిచేత్తో మోసే ప్రయత్నం చేశాడు.

ట్యాగ్స్​