విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతడి లేటెస్ట్ మూవీ ‘వారిసు’ ట్రైలర్ వచ్చేసింది. ఔటండౌట్ కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీలో ఇప్పటికే కొన్ని వందల సినిమాల సబ్జెక్ట్ లానే కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ పై ఉన్న హైప్ ను ఈ ట్రైలర్ తగ్గించేసిందిలానే ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుంటే.. రష్మిక మందాన హీరోయిన్ గా చేస్తోంది. విలన్ గా ప్రకాష్ రాజ్ నటిస్తుంటే.. హీరో తండ్రిగా శరత్ కుమార్,తల్లిగా జయసుధలు కనిపిస్తున్నారు.