ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మరో యువ హీరో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తో ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ గతంలో ‘గద్దలకొండ గణేష్’ పేరుతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఈ స్పెషల్ రోల్ కోసం సంప్రదించిన వెంటనే వరుణ్ ఓకే చెప్పినట్లు సమాచారం.