ఐపిఎల్​ ఎందుకు రద్దు చేయరు : వాన్​

By udayam on September 24th / 6:29 am IST

ఐపిఎల్​లో సన్​ రైజర్స్​ ఆటగాడు నటరాజన్​ పాజిటివ్​గా తేలినప్పటికీ లీగ్​ను కొనసాగించడంపై ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకెల్​ వాన్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కరోనా కేసులున్నాయన్న కారణంతోనే భారత్​.. ఇంగ్లాండ్​తో జరగాల్సిన మాంచెస్టర్​ టెస్ట్​ను రద్దు చేసుకుందన్న అతడు.. మరి కరోనా ఐపిఎల్​కు వచ్చినా లీగ్​ను ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు. నటరాజన్​కు కరోనా సోకిందని క్రిక్​బజ్​ చేసిన ట్వీట్​కు రిప్లై ఇస్తూ.. ‘చూద్దాం ఐపిఎల్​కూ మాతో జరగాల్సిన చివరి టెస్టులానే క్యాన్సిల్​ అవుతుందేమో!! ఖచ్చితంగా అవ్వదులే’ అంటూ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.

ట్యాగ్స్​