వీరసింహారెడ్డి ఫస్ట్​ రివ్యూ: చివరి 15 నిమిషాలు అద్భుతమట!

By udayam on January 10th / 6:52 am IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహరెడ్డి మూవీ తాలూకా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్​ సెన్సార్​ బోర్డ్​ సభ్యుడు ఉమైర్​ ఫస్ట్​ రివ్యూ ప్రకారం ‘సినిమాకు బాలకృష్ణ మూలస్తంభంలా నిలబడ్డారు. మాస్ ఆడియన్స్‌ను బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించడే కాదు.. కొన్ని సన్నివేశాల్లో తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు పెట్టించారు. అలాగే ఈ స్టార్ హీరో డాన్సులు కుమ్మేశారు. నాన్ స్టాప్ యాక్షన్ స్టంట్స్! స్టోరీ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా, టైంపాస్ అయ్యే విధంగా ఉంది. టర్కీ లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించారు. ఆఖరి 15 నిమిషాలు సినిమా అద్భుతం. మొత్తంగా చూసుకుంటే ఇది పైసా వసూల్ మాస్ మూవీ’ అని ఉమైర్ సంధు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసారు. ఇక సినిమా కు 3 .5 /5 రేటింగ్ ఇచ్చాడు.

ట్యాగ్స్​