టామాటా కేజీ 100, క్యారెట్​ 80

By udayam on May 28th / 4:54 am IST

20 రోజుల క్రితం రూ.10 నుంచి రూ.20 పలికిన కేజీ టమాటా ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. తెలంగాణలోని పలు మార్కెట్లలో టమాటా కేజీ రూ.80 నుంచి రూ.100 పలుకుతూ సామాన్యులకు అందని ద్రాక్ష అయింది. పెరిగిన ఎండలకు దిగుబడి తగ్గడం ఓ ఎత్తైతే.. పెళ్ళిళ్ళ సీజన్లో కూరగాయలకు డిమాండ్​ ఉండడమూ ధరల పెరుగుదలకు మరో కారణంగా కనిపిస్తోంది. టమాటాలతో పాటు క్యారెట్​, చిక్కుళ్ళు, బంగాళాదుంపలు, వంకాయలు, బీరకాయలు, మిర్చి, దొండకాల రేట్లూ 100 శాతం పెరిగాయి.

ట్యాగ్స్​