లిక్కర్ బాటిళ్ళ లోడుతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు తమిళనాడులోని మధురై వద్ద తిరగబడింది. రూ.10 లక్షల సరుకుతో వెళ్తున్న ఈ ట్రక్కు విరగనూర్ గ్రామానికి రాగానే హైవేపై బోల్తా పడింది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం బాటిళ్ళను అందినకాడికి ఎత్తుకుపోయారు. కేరళలోని మనలూర్‌లో ఉన్న మద్యం గోడౌన్‌కు ఈ సరుకును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు బాటిళ్ళ కోసం ఎగబడడంతో ఈ హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.